ఆ ముగ్గురు మహిళా నేతలకు గవర్నర్ పదవులు
- June 01, 2019
ఢిల్లీ:కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్‌ను సముచితంగా గౌరవించాలని పార్టీ నిర్ణయించింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన సుష్మకు ఇటీవలి కాలంలో ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ఆమెకు ఒత్తిడితో కూడిన మంత్రిపదవి అప్పగించలేదు. అయితే ఆమెను ఓ పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలని కేంద్రానికి బీజేపీ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.
సుష్మ స్వరాజ్‌తో పాటు… గత లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌తో పాటు.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతికి కూడా గవర్నర్ పదవులు ఇవ్వాలని సూచించనున్నట్లు సమాచారం. వయోభారం కారణంగా సుమిత్ర మహాజన్ ఈ సారి ఎన్నికల బరిలో దిగలేదు. అలాగే ఉమాభారతి సైతం ఆరోగ్య సమస్యల కారణంగా పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధ్యానికి దూరమైన ఈ ముగ్గురిని సముచితంగా గౌరవించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







