'ఈద్ అల్ ఫితర్' పండుగనాడు ఇలా చేయడం సంప్రదాయం
- June 04, 2019
గుసుల్ (శుద్ధి స్నానం చేయటం): ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు గుసుల్ (తల స్నానం) చేయాలి.
మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి.
సుగంధ ద్రవ్యాలు వాడడం: స్తోమతను బట్టి సువాసన కోసం సుగంధ ద్రవ్యాలు వాడాలి.
తక్చీర్ పలకడం: 'అల్లాహుఅక్బర్ అల్లాహు అక్బర్ లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్' అని గట్టిగా పలుకుతూ ఉండాలి.
కాలి నడకన ఈద్ గాహ్‌కు వెళ్లడం: నమాజ్ కోసం ఈద్ గాహ్‌కు కాలినడకన వెళ్ళాలి. ఒకదారిన వెళ్ళి, మరోదారిన తిరిగి రావాలి.
ఖర్జూరాలు తినడం: ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపి వస్తువు తినవచ్చు.
బంధుమిత్రులను కలుసుకోవడం: మసీదుకు వెళ్లి నమాజ్ పూర్తి చేసుకున్న తర్వాత తెలిసిన వారిని, బంధువులను అక్కడే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అందుబాటులో ఉన్న వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలి.
సహనంతో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు.. రమదాన్ పవిత్ర మాసంలో రోగులను పరామర్శించడం చాలా ఉత్తమం. పండుగ నాడు వారిని కలిసి చేతనైనంత సాయం చేయాలి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







