ఈద్‌ అల్‌ ఫితర్‌ హాలీడేస్‌.. ఖతార్ మిటియరాలజీ ఫోర్ కాస్ట్..

- June 03, 2019 , by Maagulf
ఈద్‌ అల్‌ ఫితర్‌ హాలీడేస్‌.. ఖతార్ మిటియరాలజీ ఫోర్ కాస్ట్..

దోహా: ఖతార్‌ మిటియరాలజీ డిపార్ట్‌మెంట్‌, రానున్న హాలీడేస్‌కి సంబంధించి వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ని విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం కొన్ని చోట్ల చాలా వేడిగా వుండొచ్చనీ, కొన్ని చోట్ల మాత్రం ఆకాశం మేఘావృతమై వుండొచ్చని తెలుస్తోంది. విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువగా వుండొచ్చని మిటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ వివరించింది. సముద్రంలో కెరటాలు 3 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తువరకు వుండొచ్చు. 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడక్కడా వర్షాలు కూడా కూరిసే అకవాశం లేకపోలేదు. డైరెక్ట్‌ సన్‌లైట్‌కి దూరంగా వుండాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని సోషల్‌ మీడియా ద్వారా అందిస్తామని మిటియరాలజీ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com