యూఏఈ తొలి పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డెన్ కార్డ్ దక్కించుకున్న ఇండియన్ బిలియనీర్
- June 04, 2019
యూఏఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ ఐసిఎ, తొలి గోల్డెన్ రెసిడెన్స్ పర్మిట్ కార్డుని అబుదాబీలో జారీ చేసింది. 'ఇన్వెస్టర్స్ పర్మినెంట్ రెసిడెన్స్ సిస్టమ్'లో భాగంగా ఈ కార్డుల నిర్ణయం అమల్లోకి తెచ్చారు. యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఎ యూసుఫ్ అలి ఈ గోల్డెన్ కార్డ్ అందుకున్న తొలి వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కారు. కేరళకి చెందిన కేరళ టైకూన్ యూసుఫ్‌అలీ, 4.7 బిలియన్ డాలర్ల సంపదతో యూఏఈలో రిచ్చెస్ట్ వలసదారుడిగా రికార్డులకెక్కిన విషయం విదితమే. అలీకి తొలి గోల్డెన్ కార్డ్‌ని అబుదాబీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ ఫారిన్ ఎఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ సలెమ్ అల్ షామ్సి అందజేశారు. తొలి బ్యాచ్‌లో 6,800 మంది ఇన్వెస్టర్స్‌కి ఈ కార్డులు అందుతాయి. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న యూసుఫ్ అలీ మాట్లాడుతూ, చాలా ఆనందక్షణాల్ని తాను ఎంజాయ్ చేస్తున్నానీ, విజనరీ రూలర్స్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. గోల్డ్ కార్డ్, ఇన్వెస్టర్స్‌కి ఎంతో కీలకం అవుతుందని, దేశ ప్రగతిలో ఇన్వెస్టర్స్ తమవంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







