రోడ్డు ప్రమాదం: సముద్రంలోకి దూసుకెళ్ళిన కార్లు

రోడ్డు ప్రమాదం: సముద్రంలోకి దూసుకెళ్ళిన కార్లు

షార్జాలోని అల్‌ ఖాన్‌ సముద్రంలోకి రెండు కార్లు ప్రమాదవశాత్తూ దూసుకెళ్ళాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మెరిటైమ్‌ రెస్క్యూ యూనిట్‌ - షార్జా పోలీస్‌ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్లను సముద్రపు నీటిలోంచి అధికారులు బయటకు తీసుకొచ్చారు. కాగా, రెండు కార్లూ ట్రాఫిక్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద రిజిస్టర్‌ కాలేదని అధికారులు వివరించారు. సముద్ర తీరానికి సమీపంలో కార్లను పార్క్‌ చేయడం ద్వారా ప్రమాదాలకు కారణమవుతారనీ, ఈ విషయంలో మోటరిస్టులు అప్రమత్తంగా వుండాలనీ, వేగ పరిమితులు పాటించాలనీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.  

Back to Top