::ధ్యాన మందిరం::
- January 03, 2016
కళ్లు తెరిచే ఉన్నాను
చుట్టూ కటిక చీకటి;
చెవులు పనిచేస్తూనే ఉన్నాయ్
కానీ పక్కవాడు చెప్పేది వినపడలేదు;
కళ్ల ముందు మనలాంటిదే మరో లోకం
చెవులకి వినిపించేది ఆ లోకం తాలూకు శబ్దాలు;
నవ్వాను,
నిశ్శబ్దంగా ఏడ్చాను,
కోపంతో రగిలిపోయాను,
అంతలోనే ఉపశాంతి పొందాను;
అంతా ఒక తాదాత్మ్యం
జాగృదావస్థలో అలౌకికానందం;
ఏ జ్ఞానికో, ఏ సన్యాసికో, ఏ యోగికో
ఏళ్ల కృషి తర్వాత సిధ్ధిస్తుందని వినే ఆ స్థితిని-
రోజుకు నాలుగు సార్లు ఎవ్వడికైనా ఇవ్వగలిగే ధ్యాన మందిరం-
సినిమా హాల్
- సిరాశ్రీ
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







