వచ్చే ఏడాదికల్లా 'దుబాయ్‌ మాల్‌' బ్రిడ్జ్‌ రెడీ

- January 03, 2016 , by Maagulf
వచ్చే ఏడాదికల్లా 'దుబాయ్‌ మాల్‌' బ్రిడ్జ్‌ రెడీ


అల్‌ ఖాయిల్‌ రోడ్‌ నుంచి ఫైనాన్షియల్‌ సెంటర్‌ రోడ్‌ని కనెక్ట్‌ చేసే 120 మిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ నిర్మాణం వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. రెండు లేన్లుగల ఈ బ్రిడ్జ్‌ ఇండివిడ్యువల్‌ పిల్లర్స్‌తో, దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌ మీదుగా నిర్మితం కానుంది. బ్రిడ్జ్‌ నిర్మాణం కోసం అవసరమైన మేర ఇతర రోడ్లను విస్తరించడం, డైవర్షన్‌ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావడం, వీటితోపాటుగా ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్‌, వాట్‌, సీవేజ్‌ మరియు టెలికమ్యూనికేషన్‌ లైన్స్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రస్‌ అల్‌ ఖోర్‌ రోడ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద ప్రారంభమయ్యే ఈ రోడ్డు, ఫైనాన్షియల్‌ సెంటర్‌ రోడ్‌ అప్పర్‌ డెక్‌ వరక విస్తరించేలా నిర్మాణం చేపట్టారు. దుబాయ్‌ మాల్‌కి సంబంధించిన పార్కింగ్‌ టెర్మినల్‌కి కనెక్ట్‌ అయ్యేలా బ్రిడ్స్‌ నుంచి ఎంట్రీ పాయింట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని తగ్గించడం, తక్కువ సమయంలో ఫైనాన్షియల్‌ సెంటర్‌కి చేరుకునేలా వాహనదారులకు మంచి ప్రయాణాన్ని అందించడం కోసమే ఈ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com