అంధుల జీవితాలకు అక్షర వెలుగులు లూయీ బ్రెయిలీ

- January 03, 2016 , by Maagulf
అంధుల జీవితాలకు అక్షర వెలుగులు లూయీ బ్రెయిలీ

అంధుల జీవితాలకు అక్షర వెలుగులు లూయీ బ్రెయిలీ  43 ఏళ్ళ జీవిత కాలంలో అంధులకు మహోపకారం  జనవరి 4 వ తేది  207వ జయంతి  జనవరి 6 వ తేది 164 వ వర్ధంతి చరిత్రలోకి తొంగిచూస్తే, ఎన్నో దేశాలలో కుంటి, గ్రుడ్డి, చెవిటి మొదలైనవారి జీవితాలు దుర్భరంగా వుండేవి. కొందరి ఆంగవైకల్యం మరి కొందరికి జీవికోపార్జన సాధనంగా మారిపోయింది. వాళ్ళను బిచ్చగాళ్ళగా మార్చి ఆ ఆదాయం హరించే కొందరు వ్యక్తులూ సమాజంలో వున్నారు.గ్రుడ్డివారి పరిస్థితి మరీ దయనీయం. వారికి కళ్ళు లేవు కనుక వారికి ఏ రకమైన అలంకరణ చేసినా, తెలియదుకదా. 1771లో ఫ్రాన్సులో ఒక పెద్ద మనిషి గ్రుడ్డివారిని చాలా మందిని సమీకరించి వారికి గాడిదలలాగా, కోతులలాగా వేషాలు వేసి డబ్బు సంపాదించేవాడు. పండగలు, పబ్బాలలో గ్రుడ్డివారు తక్కినవారి వినోదానికి సాధనాలయ్యేవారు. వాలెంటైెన్‌ హ్యూ అనే దయామయుడు ఇదంతా చూచి ఆవేదన చెందాడు. గ్రుడ్డివారికి సమాజంలో స్థానం కల్పించాలని కృషి మొదలుపెట్టాడు. వారికి చదువు చెప్పాలని పూనుకున్నాడు. 1784లో పారిస్‌లో మొట్టమొదటిసారిగా గ్రుడ్డివారి కొరకు ఒక పాఠశాలను మొదలుపెట్టాడు. 18వ శతాబ్దంలో యూరపులో అంధులకు విద్య గరపడానికి కృషి ప్రారంభం అయింది.1868లో డాక్టర్‌ టి.ఆర్‌. అర్మబేజ్‌ బ్రిటిష్‌ అండ్‌ ఫారెన్‌ బ్లయిండ్‌ అసోసియేషన్‌ అని ప్రారంభించాడు. అంధులకు ముందు సంగీతంలో ప్రావీణ్యం కల్పించేవారు. వివిధ వాయిద్యాలలో, గాత్ర సంగీతంలో అంధు లకు శిక్షణ లభించేది, వారికి గల ఏకాగ్రత పట్టుదలతో సంగీతంలో వారు నిష్ణాతుల య్యేవారు.అంధులకు చదువు చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి. కంటతో వారు చూడ లేరు. స్మర్శ తప్ప మరో మార్గంలో వారు స్వయంగా చదువకోలేరు. అందుచేత మామూలు ప్రింటింగు పద్ధతినికాక, ఎత్తుగా ఉబ్బివుండే విధంగా అక్షరాలుఉన్న పుస్తకాలు కావాలి. స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొం దించాడు. విచిత్రమేమంటే గ్రుడ్డివాళ్ళకు చదువుకోవడానికి పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలన్న విషయంలో ఎక్కువ కృషి సల్పింది అంధులే. రకరకాల ప్రయోగాలు చాలాకాలం జరిపారు. అయితే వారు చెక్క బోర్డు మీద పుస్తకాలు తయారు చేయాలని ప్రయత్నిం చారు. పారదస్‌ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతని మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం రూపొందిం చారు. . 1784లో ఇది కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. తరువాత ఎంతోమంది దీని గురించి పరిశోధన కొనసాగించారు. అయితే అవి గ్రుడ్డివారికి చదువు నేర్చు కొనడానికి అంత సులభంగా వుండేవికావు. ఆధునిక యుగంలో గ్రుడ్డివారి పుస్తకాలన్నీ బ్రెయిల్‌ పద్ధతిలో ఉంటున్నాము. దీనిని కనుగొన్న వ్యక్తి లూయీ బ్రెయిలీ. ఇతను కూడా అంధుడే. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి నవయుగ వైతాళికుడయ్యాడు.లూయీ బ్రెయిల్‌ ఫ్రాన్సురాజధాని పారిస్‌కు దగ్గరలో 1809లో జనవరి 4 లో జన్మించాడు. ఒక ప్రమాద కారణంగా తన మూడవ ఏటనే కంటిచూపు కోల్పోయాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు.బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు. అంధులకు పుస్తకాలు ప్రింటుచేయడానికిఅంతవరకు ఉన్న విధానాలు బ్రెయిలుకు లోపభూయిష్టంగా కనబడ్డాయి.అంధులకు చూసే అవకాశం లేదు. కనుక ఆ ప్రింటింగు విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి వుండాలని గ్రహించాడు. ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుండాలని భావించాడు. ఒక గీతగా కాకుండా, చుక్కలు చుక్కలుగా వుంటే చదవటం తేలిక అని బ్రెయిల్‌ నిశ్చయానికి వచ్చాడు.20 సంవత్సరాల యువకుడైన బ్రెయిల్‌ తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. మరి 5 సంవత్సరాల పరిశోధనలో బ్రెయిల్‌ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు.ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉప యోగించడం వల్ల బ్రెయిల్‌ మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవా త్మకమైన మార్పు, ఆరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్కనుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు.

ఉదాహరణకు :.

A దీ జ ణ టశీతీ
. . .. . ...
. ...
. . ...
ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరు చుక్కలలో బ్రెయిల్‌ రూపొందిం చాడు. ఈ రకంగా గ్రుడ్డివారు బ్రెయిలులో వ్రాయగలరు. చదవగలరు. వారికి ఇతరుల సహాయం అక్కరలేదు. ఇంగ్లీషు, తెలుగు, భాషలన్నీ ఎడంనుండి కుడికి వ్రాస్తాంకదా. బ్రెయిల్‌లో కుడినుండి ఎడమకు వ్రాయడం జరుగుతుంది. బ్రెయిలులో టైపురైటర్లు కూడా రూపొందించడం జరిగింది.
బ్రెయిలీ 1852 జనవరి 6న 43 సంవత్స రాల పిన్న వయస్సులోనే మరణించాడు. అంధులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణానంతరమే వచ్చింది. సంగీతాన్ని కూడా తన లిపిలో వ్రాయడం అతని విశిష్టత. ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిలీ లిపికి గుర్తింపు వచ్చి అంగీకరించినా, అమెరికా 1916లోనే దానిని ఆమోదించింది.బ్రెయిలీ మరణ శతాబ్ది సందర్భంగా 1952లోఅతని అస్తికలను పారిస్‌లో పాంథియన్‌లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినో త్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనినికీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదే విధంగా అమెరికా ఒక డాలరు నాణాన్ని విడుదలచేయడం అపూర్వం, అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com