థాయ్ కొత్త ప్రధానిగా ఎన్నికైన ఛాన్ ఓఛా .!
- June 06, 2019
థాయ్ లాండ్ కొత్త ప్రధానిగా పాలక సైనిక కూటమి నేత జనరల్ ప్రయుత్ ఛాన్ ఓఛాను కొత్త పార్లమెంట్ ఎంపిక చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పార్లమెంట్ ఉభయసభల సమావేశంలో ప్రధానికి ఎన్నికయ్యేందుకు అవసరమైన 375 ఓట్లను ఆయన సాధించారు. పార్లమెంట్ దిగువ సభకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, ఎగువ సభను మొత్తం పాలక సైనిక కూటమి నియమించిన విషయం తెలిసిందే. మార్చి 24న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 10 వారాల తరువాత ప్రధాని ఎన్నిక జరగటం గమనార్హం. సైనిక కూటమి తన పాలనను సుస్థిరం చేసుకునేందుకే సార్వత్రిక ఎన్నికల తంతును నిర్వహించిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







