దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 8మంది భారతీయులు మృతి

- June 07, 2019 , by Maagulf
దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 8మంది భారతీయులు మృతి

దుబాయ్:దుబాయ్ లో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయ్ కి తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.అతివేగంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టింది.ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.

 మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.రోడ్డు ప్రమాదం లో భారత్‌కు చెందిన రాజగోపాలన్,ఫిరోజ్ ఖాన్  పఠాన్, రేష్మ  ఫిరోజ్  ఖాన్  పఠాన్, దీపక్  కుమార్, జమాలుద్దీన్  అరక్కవీట్టిల్,కిరణ్  జానీ,వాసుదేవ్, మరియు తిలక్రామ్ జవహర్ ఠాకూర్ ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్‌ అధికారులు తెలిపారు.మృతుల్లో నలుగురు తమిళనాడు,కేరళకు చెందిన వారు. 

మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని, బాధితులకు రాయబార కార్యాలయం అండగా ఉంటుందని కాన్సులేట్‌ జనరల్ విపుల్ తెలిపారు.ప్రమాదంలో మరికొందరు భారతీయులు గాయపడగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com