సౌదీ అరేబియాలో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ'
- June 08, 2019
సౌదీ అరేబియా:మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సౌదీ రాజధాని రియాద్‌లో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 'డిప్లమాటిక్ క్వార్టర్ అథారిటీ అండ్ సౌదీ సైక్లింగ్ ఫెడరేషన్' సహకారంతో సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది.సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్త డాక్టర్ అసీఫ్ సయీద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 150 మంది ఇరు దేశాల ఔత్సాహికులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయీద్ మాట్లాడుతూ.. గాంధీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను అందరూ ఆచరించాలని తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. 6 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా APNRT కో-ఆర్డినేటర్ రెవెల్ ఆంటోనీ అబెల్ కూడా పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







