హైదరాబాద్:చేపమందు పంపిణికి ఏర్పాట్లు పూర్తి
- June 08, 2019
హైదరాబాద్:చేపమందు పంపిణికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు చేప మందు పంపిణి చేస్తారు. ఇప్పటికే దేశనలుమూల నుంచి చేపమందు కోసం ఆస్తమా రోగులు తరలివచ్చారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సాగనున్న చేప మందు పంపిణికి మొత్తం 36 కౌంటర్లను సిద్ధం చేశారు.
వికలాంగులకు , వృద్దులకు, మహిళలకు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లక్షా 60వేల కోర్ర మేను చేప పిల్లలను సిద్ధం చేసింది మత్స్యశాఖ. 3లక్షల 50వేల వాటర్ ప్యాకెట్లను జలమండలి రెడీ చేసింది. అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ఈరోజు 4 గంటల నుంచి రేపు సాయంత్రం 6గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు విధించారు.
1845 నుంచి చేపమందు పంపిణి కొనసాగుతోంది. వరుసగా మూడు ఏళ్లు చేప మందు స్వీకరిస్తే ఆస్తమా రోగం నయం అవుతుందని బత్తిని సోదరులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







