దుబాయ్ లో భారత కేంద్ర మంత్రి ని కలిసిన 'బి.జె.పి NRI సెల్'

దుబాయ్ లో భారత కేంద్ర మంత్రి ని కలిసిన 'బి.జె.పి NRI సెల్'

దుబాయ్:దుబాయ్ కు మొదటిసారి ఒక్క రోజు పర్యటనకు నిమిత్తం విచ్చేసిన భారత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ కు అపూర్వ స్వాగతం లభించింది.దుబాయ్ లోని 'తాజ్ దుబాయ్' హోటల్ లో మంత్రి ని కాన్సులేట్ జనరల్ విపుల్, బి.జె.పి NRI సెల్ స్టేట్ కన్వీనర్ హరికుమార్,NRI సెల్ స్పోక్స్ప్ర్సన్ సజివ్ పురుషోత్తమన్,NRI సెల్ గల్ఫ్ కో -ఆర్డినేటర్ చంద్ర ప్రకాష్ కలిశారు.ఈ సమావేశంలో గల్ఫ్ లో కమ్యూనిటీ సెంటర్, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మరియు మిడిల్ ఈస్ట్ లో నేషనల్ పెన్షన్ స్కీం భారతీయులకు అమలు చేయాలని చర్చించారు.NRI సెల్ తరపున మంత్రికి మెమొరాండం సమర్పించారు.ఈ రోజు ఉదయం మంత్రి నైజీరియా బయల్దేరి వెళ్లారు.

Back to Top