గాల్లో బాంబులా పేలిన స్పైస్‌జెట్ టైరు..దుబాయ్ విమానం అత్యవసర ల్యాండింగ్
- June 13, 2019
దుబాయి : స్పైస్ జెట్‌కు చెందిన ఓ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే టైరు పేలిపోయింది. దుబారు నుంచి జైపూర్ బయల్దేరిన ఈ విమానం సగం ప్రయాణం చేశాక విమానం టైర్లలో ఒకటి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. మొత్తానికి ఏదో జరిగిందని భావించిన స్పైస్ జెట్ సిబ్బంది, విమానానికి సమస్య ఏర్పడిందని జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అత్యవసర సమాచారం అందించారు. దాంతో, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పైస్ జెట్ విమానంలో 198 మంది ఉన్నారు. ఎట్టకేలకు విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందికి దించారు. వెంటనే ఫ్లయిట్ లో ఉన్న అందరినీ కిందికి దింపేశారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించగా విమానం టైరు పేలిపోయి కనిపించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబారు తిరిగి వెళ్లాల్సి ఉండగా, మరమ్మతుల నిమిత్తం సర్వీసు రద్దు చేశారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







