రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ చంటికి గాయాలు..
- June 18, 2019
గత రెండు మూడు రోజులుగా షూటింగులో గాయాలపాలైన నటులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. నటుడు శర్వానంద్, నాగశౌర్య, సందీప్ కిషన్, వరుణ్ తేజ్. తాజాగా బుల్లితెర ఫేమస్ కామెడీ షో జబర్దస్త్‌లో నటించే చలాకీ చంటి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చంటి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గత ఏడాది కూడా జూన్ నెలలోనే చంటి కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు చంటి. అయితే ఆనాటి ప్రమాదంలో గుద్దుకున్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. సరిగ్గా ఏడాది తరువాత అదీ జూన్ నెలలోనే ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







