తెలంగాణ పోలీసులకు శుభవార్త..సేమ్ పించ్ అంటున్న కేసీఆర్
- June 20, 2019
తెలంగాణ పోలీసులకు శుభవార్త. ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్లు ఇచ్చినట్లుగానే… ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం పోలీసులకు వీక్లీఆఫ్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇవాల్టి నుంచి పోలీసులకు వారంతపు సెలవులు అమలు చేస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారి వరకు వీక్లీ ఆఫ్లు అమలు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ … ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇవాల్టి నుంచి వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు వారంతపు సెలవులు అమల్లోకి వచ్చాయి.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తీవ్ర పని ఒత్తిడితో ఉన్న పోలీసులకు వీక్ ఆఫ్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలోనే హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసుల్లాగే…. తమకూ వారంతపు సెలవులు ఇస్తుండటంతో… ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







