ఎంపిక చేసిన టూరిస్టులకు ఉచిత యూఏఈ వీసా
- June 22, 2019
యూఏఈకి ఈ సమ్మర్లో ప్రయాణించాలనుకునే టూరిస్టులకు ఉచిత వీసా అందించనుంది యూఏఈ ప్రభుత్వం. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిసన్ షిప్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఉచిత వీసా 18 ఏళ్ళ లోపు డిపెండెంట్స్‌కి మాత్రమే. జులై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతి యేడాదీ ఈ ఉచిత వీసా సౌకర్యం అందుబాటులో వుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈ క్యాబినెట్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. కాగా, 497 దిర్హామ్‌ల ఖర్చుతో 14 రోజుల ఎక్స్‌ప్రెస్ టూరిస్ట్ వీసా, 917 దిర్హామ్‌ల ఖర్చుతో 30 రోజుల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను ఆన్లైన్ ద్వారా పొందితే పొందవచ్చు. ఇదిలా వుంటే, ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇప్పటిదాకా దేశంలోని ఎయిర్‌పోర్ట్‌ల నుంచి 32.8 మిలియన్ మంది ప్రయానించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క, యూఏఈలో నివసిస్తున్న పేరెంట్స్, సెకెండరీ లేదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న 18 ఏళ్ళు నిండిన తమ డిపెండ్స్ కోసం 1 ఏడాది రెసిడెన్సీ ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్స్‌ని ఈ మేరకు సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







