షార్జా బస్సుల్లో విలాసవంతమైన సుదూర ప్రయాణం
- January 04, 2016
షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కొత్తగా 10 లగ్జరీ బస్సుల్ని ఇంటర్‌సిటీ ఫ్లీట్‌కి జతచేసింది. ఈ కొత్త బస్సుల రాకతో, సుదూర ప్రయాణాలు చేసేవారికి ఉపశమనం కలుగుతుంది. వారాంతాల్లో ఈ బస్సులకు పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో కొత్తగా 10 బస్సుల్ని ప్రవేశపెట్టారు. వాల్వో కంపెనీకి చెందిన ఈ బస్సుల్లో మొత్తం 46 సీట్లు వుంటాయి. మంచి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, వైఫై సౌకర్యాలు, వీటితోపాటుగా సీసీటీవీ కెమెరాలు వెరసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బస్సులు, ప్రయాణీకులకు సుదూర ప్రయాణాల్లో మధురానుభూతిని మిగల్చనున్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా డ్రైవర్‌కి వీలుగా ఏర్పాటు చేశారు. తక్కువ దూరం ప్రయాణించేవారికి 5 నుంచి 20 దిర్హామ్‌ల ఖర్చుతోనూ, దూర ప్రయాణాలు 20 నుంచి 30 దిర్హామ్‌ల ఖర్చుతోనూ విలావసంతమైన బస్సులు ఏర్పాటు చేశారు. గత ఏడాది 39 బస్సుల్ని ప్రవేశపెట్టిన షార్జా రోడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, తాజాగా ప్రవేశపెట్టిన బస్సులతో కలిపి మొత్తం 69 లగ్జరీ బస్సుల్ని ప్రయాణీకులకు సేవలందించేలా వినియోగిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







