ట్విట్టర్‌లో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న షేక్‌ మొహమ్మద్‌

ట్విట్టర్‌లో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న షేక్‌ మొహమ్మద్‌

దుబాయ్‌:గడచిన పదేళ్ళలో సోషల్‌ మీడియాలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. వైస్‌ ప్రెసిడెంట్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, సోషల్‌ మీడియాని వినియోగించుకోవడం ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చారు. ఇది జరిగి 10 ఏళ్ళయ్యింది. ఈ పదేళ్ళలో 9.71 మిలియన్‌ మంది ఫాలోవర్స్‌ని ట్విట్టర్‌లో ఆయన సంపాదించుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతున్న షేక్‌ మొహమ్మద్‌, కీ ప్రాజెక్టు లవివరాల్ని, ఇతరత్రా అతి ముఖ్యమైన విషయాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ది 50 మోస్ట్‌ ఫాలోవ్డ్‌ వరల్డ్‌ లీడర్స్‌ 2018 లిస్ట్‌లో దుబాయ్‌ రూలర్‌ స్థానం 11.  

Back to Top