నాలుగు హెల్త్ సెంటర్స్‌లో లో రేడియేషన్ స్కానింగ్ సౌకర్యం
- June 27, 2019
బహ్రెయిన్:400,000 విలువైన మెడికల్ ఎక్విప్‌మెంట్‌ని కింగ్‌డమ్‌లోని నాలుగు హెల్త్ సెంటర్స్‌కి పంపించడం జరిగింది. వీటిద్వారా లో రేడియేషన్ స్కానింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ డివైజెస్‌ని ఆయా ఆసుపత్రుల్లోని రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌కి అందజేసినట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. జిదాఫ్స్ హెల్త్ సెంటర్, అ-అలి హెల్త్ సెంటర్, హమాద్ కన్నూ హెల్త్ సెంటర్, అరాద్‌లోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ హెల్త్ సెంటర్లలో ఈ లో-రేడియేషన్ స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. బోన్ మరియు స్పైనల్ డిసీజెస్, చెస్ట్ ఇన్‌ఫెక్షన్స్, థ్రోట్ ఇన్‌ఫెక్షన్స్ కోసం వీటిని వినియోగిస్తారు. అత్యవసర వైద్య సేవలకూ వీటిని ఉపయోగించవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. ఇదిలా వుంటే, పలు హెల్త్ సెంటర్స్‌లో రౌండ్ ది క్లాక్ సేవల్ని అందించాల్సిందిగా మినిస్ట్రీ ఆదేశించింది. ఈ మేరకు పలు సెంటర్స్, రోగులకు 24 గంటలు సేవలు అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







