అల్ అరిష్‌పై టెర్రరిస్ట్ ఎటాక్‌ని ఖండించిన బహ్రెయిన్
- June 28, 2019
ఈజిప్ట్‌లోని నార్త్ సినాయ్‌లోగల అల్ అరిష్‌లో పోలీస్ ఔట్ పోస్టులపై తీవ్రవాదులు జరిపిన దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాల పట్ల మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ తీవ్ర సానుభూతి వ్యక్తం చేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయం విషయంలో అయినా ఈజిప్ట్‌కి సంపూర్ణ మద్దతు అందిస్తామని ఈ సందర్బంగా బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ స్పష్టం చేసింది. అల్ అరిష్ తీవ్రవాద ఘటనలో మొత్తం ఏడుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈజిప్ట్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆసియా కప్ పోటీల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది ఈజిప్ట్. టోర్నమెంట్‌కి సరిగ్గా నెల రోజుల ముందు టూరిస్ట్ బస్‌పై తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







