భవనాల్లో అగ్ని ప్రమాదం: 1,300 ఘటనల నమోదు
- June 28, 2019
మస్కట్: ప్రతి యేడాదీ భవనాల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. 2016లో మొత్తం 1100 రెసిడెన్షియల్ ఫైర్స్ చోటు చేసుకోగా, 2017లో ఈ సంఖ్య 1234గా నమోదయ్యింది. 2018లో ఈ సంఖ్య 1335గా నమోదయ్యింది. వైరింగ్‌లో లోపాలు, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్‌కి సంబంధించి ఓవర్ లోడ్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఎక్కువ సేపు వినియోగించడం, సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం వంటివి ఈ ఘటనలకు కారణంగా పిఎసిడిఎ పేర్కొంది. తడి చేతులతో ఎలక్ట్రానిక్ పరికరాల్ని తాకరాదనీ, వినియోగించిన వెంటనే వాటిని జాగ్రత్త చేయడం, అలాగే విరివిగా సర్వీసింగ్ చేయించడం వంటి చర్యల ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







