తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు రెండోరోజు సమావేశం

- June 29, 2019 , by Maagulf
తెలుగు రాష్ట్రాల  ఉన్నతాధికారులు రెండోరోజు సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నతాధికారులు రెండోరోజు సమావేశం అవుతున్నారు. 9, 10 షెడ్యూల్‌ సంస్థలు, ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరుగుతున్న సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.

గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు, శ్రీశైలం డ్యాంకు తరలించి రాయలసీమకు అందించడంపై నిన్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమాలోచనలు జరిపారు. ఇతర సమస్యల పరిష్కారానికి కలిసి నడుద్దామని నిర్ణయించారు. ఈమేరకు ఇవాళ ఉన్నతాధికారుల సమావేశం జరుగుతోంది. విద్యుత్‌ సంస్థల వివాదాల పరిష్కారం, పౌరసరఫరాల సంస్థ బకాయిల చెల్లింపు తదితర అంశాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com