ఢిల్లీకి డైరెక్ట్ సర్వీసుల్ని పెంచనున్న గల్ఫ్ ఎయిర్
- July 02, 2019
బహ్రెయిన్: కింగ్‌డమ్ నేషనల్ క్యారియర్ అయిన గల్ఫ్ ఎయిర్, ఢిల్లీకి డైరెక్ట్ సర్వీసుల్ని పెంచనుంది. ఇప్పటిదాకా రోజుకు రెండు డైరెక్ట్ సర్వీసులు నడుస్తుండగా, జులై 9 నుంచి ఈ సంఖ్య మూడుకు చేరుకోనుంది. బహ్రెయిన్ - ఇండియా మధ్య డైరెక్ట్ సర్వీసులు 1960 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 75 వీక్లీ విమానాలు దేశంలోని ఎనిమిది నగరాలకు సేవలందిస్తున్నాయి. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా సేవల్ని విస్తరిస్తున్నామనీ, ఇండియాతో బహ్రెయన్‌కి వున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రెసిమిర్ కుకో చెప్పారు. సర్వీసుల్ని పెంచడమే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలతో కనెక్టివిటీ వుండేటట్లుగా ఆ సర్వీసుల్ని డిజైన్ చేయడం జరుగుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







