అభా ఎయిర్ పోర్ట్‌పై హౌతీ దాడి: 8 మంది సౌదీలు, ఒక భారతీయుడికి గాయాలు
- July 02, 2019
సౌదీ అరేబియా: ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 9 మంది గాయపడ్డారు. అభా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఈ దాడి జరిగింది. కోలిషన్ ఫోర్సెస్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి కమాట్లాడుతూ, మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డట్లు ఆయన వివరించారు. గాయపడ్డవారి పరిస్థితి స్టేబుల్‌గా వుందనీ, వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు కల్నల్ అల్ మాల్కి. ఇటీవలి కాలంలో వరుసగా అభా అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా తీవ్రవాదులు దాడులకు తెగబడ్తున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







