ముంబై నీటిలోనే ఉంది
- July 04, 2019
ముంబై:దేశ ఆర్ధిక రాజధాని ముంబై నీటిలోనే ఉంది. ఐదురోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఎటూ చూసి నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కుంటలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. రవాణా స్థంబించిపోయింది. జనజీవనం అతాలాకుతలమైంది. నగరంలో ఎటూ చూసిన నీరే. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన తగ్గినప్పుడు ఇంటి నుంచి బయటకొచ్చి నిత్యావసరాలు కొనుక్కోవడం తప్పితే.. కాలు బయటపెట్టలేకపోతున్నారు.
ముంబై లైఫ్‌లైన్ లోకల్ ట్రెయిన్ల పరిస్థితి దారుణం. అతి కష్టం మీద నడుపుతున్నారు. చాలాచోట్ల రైల్వే ట్రాక్‌పై వర్షపు నీటి ప్రవాహం నిలిచింది. దీంతో.. రైళ్లను నడపలేకపోతున్నారు. రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రెయిన్ కోసం గంటల కొద్ది సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ట్రాక్‌లు నానిపోయి ఉండటంతో రైళ్లను ఫాస్ట్‌గా నడపడం సాధ్యం కాదంటున్న రైల్వే శాఖ…. అతికష్టం మీద కొన్ని సర్వీసులైనా నడపుతున్నామని చెబుతోంది. అటు.. విమానాలు సైతం తిరగడం లేదు. అన్ని సర్వీసుల్ని రద్దు చేశారు. ముంబై ఇంట్నరేషన్ ఎయిర్‌పోర్ట్ దాదాపు మూత పడినట్లు కనిపిస్తోంది. అయితే.. ఎయిర్‌పోర్ట్ మూత పడలేదని, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటోంది పౌర విమానయాన శాఖ.
కుండపోత వర్షాల కారణంగా.. డ్యాంలకు భారీగా వరదనీరు వచ్చిన చేరుతోంది. రత్నగిరిలో తివారీ డ్యాంకు గండిపడింది. దీంతో 12 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు చనిపోయారు. మరో 23 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు కుంబవృష్ణి కారణంగా.. మహారాష్ట్రవ్యాప్తంగా 60 మందికి పైగా చనిపోయారు. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతోంది. ఎన్డీఆర్‌ఎప్, ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలో దిగారు. పలు చోట్ల కూలిన గోడల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీస్తున్నారు. . క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలిస్తున్నారు. ముంబైలో వానలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. జూలై నెలలో ఇంత భారీగా వర్షం కురవడం 1975 తర్వాత ఇది రెండో సారి అని అంటున్నారు ఐఎండీ అధికారులు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







