దుబాయ్, మస్కట్ మధ్య ఎ380 సర్వీసుల్ని ప్రారంభించిన ఎమిరేట్స్
- July 04, 2019
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఎ380 విమాన సర్వీసుల్ని దుబాయ్ - మస్కట్ మధ్య ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమాన సర్వీసుగా ఎ380ని అభివర్ణిస్తారు. అంత పెద్ద విమానం, కేవలం 340 కిలోమీటర్ల దూరంలో వున్న రెండు డెస్టినేషన్స్ మధ్య ప్రయాణిస్తుండడం విశేషమే. 42 మంది సిబ్బంది ఎ380 విమానాన్ని క్లీన్ చేయడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ, కేవలం 40 నిమిషాల్లోనే ఈ విమానం దుబాయ్ నుంచి మస్కట్‌కి చేరుకుంటుంది. మస్కట్ - దుబాయ్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా, ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ఈ ఎ380 విమానాన్ని నడుపుతున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ప్రతిరోజూ రెండు విమాన సర్వీసులు మస్కట్ - దుబాయ్ మధ్య నడుస్తాయి. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







