చిన్నారికి గాయం: కిండర్గార్టెన్కి జరీమానా
- July 09, 2019
బహ్రెయిన్:2017 ఏప్రిల్లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించి కిండర్గార్టెన్కి కింది కోర్డు విధించిన జరీమానాను సమర్థించింది కోర్ట్ ఆఫ్ అప్పీల్స్. ఈ ఘటనలో చిన్నారి చేతికి తీవ్ర గాయమయ్యింది. కిండర్గార్టెన్ నిర్వాహకులు, చిన్నారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని న్యాయస్థానంలో వాదనలు విన్పించడం జరిగింది. ఆట స్థలంలో మరో చిన్నారి, బాధిత చిన్నారిని నెట్టివేయడంతో చెయ్యి విరిగిపోయింది. ఈ సమయంలో అక్కడ టీచర్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని బాధిత చిన్నారి తండ్రి ఆరోపించారు. నష్టపరిహారం కింద కిండర్గార్టెన్, బాధిత కుటుంబానికి 1,500 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







