దుబాయ్ బస్ క్రాష్: కారణం అదేనా?
- July 09, 2019
ఇటీవల దుబాయ్‌లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే వున్నారు. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ మవసలాత్కి చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. అయితే, బస్సు పరిమిత వేగంతోనే వెళుతోందనీ, ప్రమాదానికి కారణం రోడ్డు బ్యారియర్ అనీ డ్రైవర్ తరఫు లాయర్ తమ వాదనల్ని న్యాయస్థానంలో విన్పించారు. బ్యారియర్‌ని అక్కడ తప్పుగా ఇన్స్టాల్ చేశారన్నది డిఫెన్స్ లాయర్ మొహమ్మద్ సైఫ్ అల్ తమిమి వాదన. రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 60 కిలోమీటర్లు కాగా, వార్నింగ్ సైన్ బోర్డ్‌కీ రిస్ట్రిక్షన్ బ్యారియర్కీ మధ్య దూరం 60 మీటర్లు వుండాలని అల్ తమిమి చెప్పారు. అయితే ఆ డిస్టెన్స్ కేవలం 12 మీటర్లు మాత్రమే వుందని తమిమి వాదించారు. బ్యారియర్ మెటల్‌తో తయారుచేసినదై వుండకూడదనీ తమిమి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







