చిన్నారికి గాయం: కిండర్‌గార్టెన్‌కి జరీమానా

- July 09, 2019 , by Maagulf
చిన్నారికి గాయం: కిండర్‌గార్టెన్‌కి జరీమానా

బహ్రెయిన్:2017 ఏప్రిల్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించి కిండర్‌గార్టెన్‌కి కింది కోర్డు విధించిన జరీమానాను సమర్థించింది కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌. ఈ ఘటనలో చిన్నారి చేతికి తీవ్ర గాయమయ్యింది. కిండర్‌గార్టెన్‌ నిర్వాహకులు, చిన్నారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని న్యాయస్థానంలో వాదనలు విన్పించడం జరిగింది. ఆట స్థలంలో మరో చిన్నారి, బాధిత చిన్నారిని నెట్టివేయడంతో చెయ్యి విరిగిపోయింది. ఈ సమయంలో అక్కడ టీచర్‌ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని బాధిత చిన్నారి తండ్రి ఆరోపించారు. నష్టపరిహారం కింద కిండర్‌గార్టెన్‌, బాధిత కుటుంబానికి 1,500 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com