రాజన్న బాటలో అడుగులేస్తున్న మోడీ
- July 10, 2019
మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సూచించారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోడీ సూచించారు.
ఈమేరకు మంగళవారం జులై 9 నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ..ఎంపీలను కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 31వ తేదీ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోడీ వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని...వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కనుక్కోవాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







