విమానం ఎక్కాలంటే వీజీ కాదు.. రూల్స్ మారాయ్..
- July 14, 2019
నిజానికి విమానం ఎక్కడం ఎప్పుడూ అంత ఈజీ కాదు. ఇదుంటే అది ఉందా.. అది ఉంటే ఇది లేదేంటి అంటూ ఎన్ని ఫ్రూఫ్‌లు తీసుకెళ్లినా ఏదో ఒకటి అడిగి సతాయిస్తుంటారు. సరే మొత్తానికి వీసా, పాస్‌పోర్టు లాంటివి వచ్చాయి కదా అనుకుంటే మూడు గంటలు ముందే వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోవాలి. ఆ చెకింగులు.. ఈ చెకింగులు అంటూ ఓ గంట. మొత్తానికి విమాన ప్రయాణం ఒక్కసారి చేస్తే మోజు కాస్తా తీరిపోతుంది. అయినా కొన్ని సందర్భాల్లో తప్పదు. ఇక బిజినెస్ చేసే వాళ్లైతే పనుల మీద అప్ అండ్ డౌన్ ఫ్టైట్ జర్నీ చేస్తుంటారు. సరే.. అదంతా ఒక ఎత్తైతే ఉన్నరూల్స్‌కి మరికొన్నింటిని జత చేసింది విమానయాన సంస్థ. వీటన్నింటిని కచ్చితంగా పాటించకపోతే మీ విమాన ప్రయాణం క్యాన్సిల్ అంటోంది. మరి ఆ రూల్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం.
ప్రయాణికుడి దగ్గర నుంచి మద్యం వాసన కాని, మత్తు పదార్ధాల సేవనం కానీ చేసాడని తెలిసిందో మీ ఫ్లైట్ జర్నీ క్యాన్సిల్ చేసే హక్కు విమాన సిబ్బందికి ఉంటుంది.
చెప్పుల్లేకుండా విమానం ఎక్కుతానంటే కుదరదు. అప్పుడు కూడా సిబ్బంది అడ్డుకుంటారు.
లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ పిచ్చి పిచ్చి దుస్తులు వేసుకుంటే అనుమతించరు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే రీతిలో మీ వస్త్రధారణ వుంటే ఓ సారి చెక్ చేసుకోమంటోంది.
ఇక నెలలు నిండిన గర్భిణులు డెలివరీ అవడానికి అమ్మగారింటికో, అమ్మమ్మ గారింటికో వెళతామంటే కుదరదు. 72 గంటల్లోగా ప్రసవించే అవకాశం లేదని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే తప్పించి ఆమెని ఫైట్ ఎక్కించుకోరు.
ఫ్టైట్ ఎక్కింతరువాత ఫోన్లు మాట్లాడ కూడదు, ధూమపానం చేయకూడదు.
ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి బాలేకపోతే కూడా ఫ్లైట్ ఎక్కనివ్వరు.
ఇంతకు ముందెప్పుడైనా హీరోలా ఫోజు కొట్టి విమాన సిబ్బంది మీద చేయి చేసుకున్న దాఖలాలేమైనా ఉంటే ఆ చిట్టా బయటకు తీసి అటువంటి వారిని కూడా అనుమతించరు.
పైవేవి లేవనుకుంటే హ్యాపీగా విమానం ఎక్కేయొచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







