బ్యాచిలర్‌ ప్యాడ్‌పై రెయిడ్‌

బ్యాచిలర్‌ ప్యాడ్‌పై రెయిడ్‌

మస్కట్‌: మునిసిపల్‌ అథారిటీస్‌, బ్యాచిలర్స్‌ నివసిస్తున్న ప్యాడ్‌ (హౌస్‌)పై దాడి చేశారు. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఓ రెసిడెన్షియల్‌ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా వున్న ఈ హౌస్‌ వున్నట్లు గుర్తించి రెయిడ్‌ నిర్వహించడం జరిగింది. మస్కట్‌ మునిసిపాలిటీ ఆఫ్‌ సీబ్‌, అల్‌ మాబిలా సదరన్‌ ఏరియాలోని ఓ ఇంటిపై రెయిడ్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా ఉల్లంఘనలు సోషల్‌ సెక్యూరిటీకి ప్రమాదకరంగా మారుతున్నట్లు అధికారులు వివరించారు. రెసిడెన్షియల్‌ ఏరియాస్‌లో నిబంధనలకు విరుద్ధంగా వున్న బ్యాచిలర్స్‌ హౌసింగ్స్‌ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు.  

Back to Top