52 ఫిలిగ్రిమ్స్‌తో వెళుతున్న బస్సుకి ప్రమాదం
- July 16, 2019
యూఏఈ: 52 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు యూఏఈలో ప్రమాదానికి గురయ్యింది. పవిత్ర మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం యాత్రీకులు వెళుతున్నారు. ఒమన్‌కి చెందిన ప్రయాణీకులు ఈ బస్సులో వున్నట్లు తెలుస్తోంది. యూఏఈ హైవేపై మెటల్ బ్యారియర్‌ని ఈ బస్సు ఢీకొంది. అబుదాబీలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ ఔటర్ రీజియన్ డైరెక్టర్ మాట్లాడుతూ, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఫిలిగ్రిమ్స్‌కి బస ఏర్పాట్లు చేశామనీ, ప్రత్యామ్నాయ ట్రాన్స్‌పోర్టేషన్ వారికి ఏర్పాటయ్యేవరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడం, స్పీడ్ లిమిట్స్‌కి లోబడి బస్సులు నడపడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చునని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







