టోల్ కట్టాల్సిందే అని తేల్చేసిన నితిన్ గడ్కరీ
- July 17, 2019
న్యూఢిల్లీ: ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేని కారణంగానే టోల్ వ్యవస్ధ కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రజలు మంచి సేవలను కోరుకుంటున్నట్లయితే టోల్‌ఫీజు కట్టాల్సిందేనని మంగళవారం లోక్‌సభలో రోడ్డు రవాణా, రహ దారుల మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్‌పై జరిగిన చర్చకు సమాధానంగా అన్నారు. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వం 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మిం చిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్ వసూలు పై కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై గడ్కరీ సమాధానమిస్తూ చెల్లించగల సామర్థ్య మున్న ఆయా ప్రాంతాలలో వసూలు చేస్తున్న టోల్ ఫీజును గ్రామీణ, పర్వత ప్రాంతాలలో రోడ్ల నిర్మాణా నికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. టోల్ వ్యవస్ధ కొనసాగుతుందని, కాలాను గుణంగా టోల్ పీజులు మారతాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







