జాత్యహంకారం..అమెరికాలో హిందూ పూజారిపై దాడి!

జాత్యహంకారం..అమెరికాలో హిందూ పూజారిపై దాడి!

 

 

అమెరికాలోని గ్రీన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా ఉన్న హరీశ్ చందర్ పూరిపై దాడి జరిగింది. పీఠం సమీపంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. హరీష్‌ చందర్‌ నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయన్ను పలుమార్లు కొట్టాడు. ఈ ఘటనలో స్వామీజీకి గాయాలు కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి సెర్జియ గువెయ (52)గా గుర్తించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

స్వామీజీపై దాడిని విద్వేష దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వామీజీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆయన శిష్యులు కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఇది మా ప్రాంతం అని నినాదాలు చేసినట్టు చెబుతున్నారు. కాగా తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్ధన చేస్తానని స్వామీజీ హరీష్‌ చందర్‌ చెప్పారు. కొన్నిసార్లు ప్రజలు నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తారని అన్నారు. గాయాల నుంచి తాను మెల్లగా కోలుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

Back to Top