అమెరికా టూర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు అడుగడుగునా అవమానాలు
- July 22, 2019
అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఎయిర్ పోర్టులో అధికారిక స్వాగతం పలికేందుకు అమెరికా అధికారులెవరూ రాలేదు. కనీస ప్రొటోకాల్ ను కూడా పాటించలేదు. అమెరికాలోని పాకిస్థాన్ అంబాసిడర్ మాత్రమే ఎయిర్ పోర్టుకు వచ్చారు. చివరికి ఆయనతో పాటే వెళ్లిపోయిన ఇమ్రాన్ ఖాన్ అతడి ఇంట్లోనే బస చేయాల్సి వచ్చింది. US ప్రభుత్వం ఎలాంటి వాహనాలు కూడా సమకూర్చలేదు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి పాక్ అంబాసిడర్ ఇంటికి మెట్రోలో వెళ్లారు ఇమ్రాన్. ఈ ఘోర అవమానాలను తట్టుకుని ఆయన అమెరికా అధినేత ట్రంప్ ను కలవనున్నారు. అసలే పాక్ తీరుపై రుసరుసలాడుతోన్న ట్రంప్ ఎలా స్పందిస్తారో..!
ఈ పర్యటన కోసం శనివారమే అమెరికా చేరుకున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆయన టూర్ ని వ్యతిరేకిస్తూ యూఎస్ లోని పలుప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్ లో MQM ప్రతినిధులు ఇమ్రాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు అమెరికాలోని పాక్ జాతీయులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ప్రసంగిస్తున్న సభలోనూ కలకలం రేగింది. బలూచిస్తాన్ మద్దతుదారులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!