ఇమ్మోరల్‌ యాక్ట్స్‌: 15 మంది అరెస్ట్‌

ఇమ్మోరల్‌ యాక్ట్స్‌: 15 మంది అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, మస్కట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 15 మంది మహిళల్ని అరెస్ట్‌ చేశారు. వీరిపై ఇమ్మోరల్‌ యాక్ట్స్‌కి పాల్పడుతున్నట్లు కేసులు నమోదు చేశారు. అరెస్టయినవారంతా వలసదారులేనని అధికారులు తెలిపారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్‌ పోలీస్‌ కమాండ్‌ 15 మంది మహిళల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, వీరిలో ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన మహిళలు వున్నారనీ, వీరంతా ఇమ్మోరల్‌ యాక్ట్‌లకు పాల్పడుతున్నారని ఆ ప్రకటనలో వివరించారు. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది.  

 

Back to Top