అమరావతి:లిప్ట్‌ కిందపడి ముగ్గురు మృతి

అమరావతి:లిప్ట్‌ కిందపడి ముగ్గురు మృతి

అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. లిప్ట్‌ కిందపడి ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. తూళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద ఈప్రమాదం చోటు చేసుకుంది. భవనం ఐదో అంతస్తులో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈఘటన జరిగింది. మృతిచెందిన వారంతా బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Back to Top