మూడేళ్ళలో కువైట్‌ని వదిలి వెళ్ళిన 65,521 డొమెస్టిక్స్‌

మూడేళ్ళలో కువైట్‌ని వదిలి వెళ్ళిన 65,521 డొమెస్టిక్స్‌

కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 65,521 మంది డొమెస్టిక్‌ వర్కర్స్‌ గత మూడేళ్ళలో కువైట్‌ని విడిచి వెళ్ళారు. తమ కాంట్రాక్టులు ముగియడంతో వీరు కువైట్‌ని వదిలినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. కాగా, 69,282 మంది డొమెస్టిక్‌ వర్కర్స్‌ని ఈ ఏడాది ఇప్పటిదాకా హైర్‌ చేసుకోవడం జరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌లో రిజిస్టర్‌ చేసుకున్న డొమెస్టిక్‌ వర్కర్స్‌ సంఖ్య 718,000కి చేరుకుంది. డిసెంబర్‌ 31 నాటి లెక్కలతో పోల్చితే, ఆరు నెలల్లో 9.6 శాతం పెరుగుదల నమోదయినట్లు అధికారులు వివరించారు. దేశంలో పనిచేస్తున్న వలసదారుల్లో డొమెస్టిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ శాతం 34.1గా వుంది. 21.1 మిలియన్‌ వలసదారులు దేశంలో పనిచేస్తున్నారు. గత మూడేళ్ళలో 2,500 మందిని డిపోర్ట్‌ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా 2015-2017 మధ్య 21,000 మంది దేశం విడిచి వెళ్ళారు. 

Back to Top