టాప్‌ 5 గ్లోబల్‌ ల్యాండ్‌ మార్క్‌లో షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌

టాప్‌ 5 గ్లోబల్‌ ల్యాండ్‌ మార్క్‌లో షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌

అబుదాబీలోని షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌, టాప్‌ 10 వరల్డ్‌ ల్యాండ్‌ మార్క్స్‌ విభాగంలో మూడో స్థానం దక్కించుకుందని గ్లోబల్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రిప్‌ అడ్వయిజర్‌ పేర్కొంది. ట్రిప్‌ అడ్వయిజర్‌ ట్రావెలర్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది అవార్డు కోసం 68 దేశాల నుంచి 759 ల్యాండ్‌ మార్క్స్‌ పోటీ పడ్డాయి. ట్రిప్‌ అడ్వయిజర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌, యంగెస్ట్‌ ల్యాండ్‌ మార్క్‌గా టాప్‌ టెన్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. కంబోడియాకి చెందిన అంగోర్‌ వాట్‌, స్పెయిన్‌కి చెందిన ప్లాజా డె ఎస్పాంజా మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి.  

 

Back to Top