యడ్యూరప్ప కు లైన్ క్లియర్ అయినట్టే!

- July 24, 2019 , by Maagulf
యడ్యూరప్ప కు లైన్ క్లియర్ అయినట్టే!

బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం మంగళవారం బలపరీక్షలో పతనమైంది. దీంతో రాష్ట్రంలో బిజెపికి అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడ్యూరప్ప పాలన పగ్గాలు స్వీకరిస్తారని బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సంకేతాలు పంపినట్టు సమాచారం.కాంగ్రెస్‌ జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వ పతనంలో కీలకభూమిక పోషించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పకే ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ నేతలతో అమిత్‌షా విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. యడ్యూరప్ప సీఎంగా ఎంపికైతే ఆయన నాలుగోసారి ఆ బాధ్యతలు చేపడతారు. కాగా ముఖ్యమంత్రిగా యడ్యూరప్పకు బాధ్యతలు అప్పగించడానికి అమిత్‌షా ఇప్పటికే పచ్చజెండా ఊపారన్న సమాచారం ఉంది. దీంతో ఇతర నేతలెవ్వరూ ఆ పదవికి పోటీ పడే పరిస్థితి లేదు. మరోవైపు బెంగళూరు నగర శివార్లలోని రమడా రిసార్టులో మంగళవారం రాత్రి నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలంతా బిజెపి శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com