నేడే ఏపీ గవర్నర్ ప్రమాణ స్వీకారం
- July 24, 2019
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వ భూషన్ హరిచందన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు హాజారుకానున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండు విడతలుగా జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆపై ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం వరకూ ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.
ఆపై నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరంతా వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి అవే బస్సుల్లో సీఎంతో పాటు మిగతా వారంతా అసెంబ్లీకి చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం తరువాత ఉభయ సభల సమావేశాలు ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..