అక్టోబర్ నుంచి అబుదాబీలో టోల్ గేట్స్
- July 25, 2019
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కొత్త ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది. అబుదాబీ ఐలాండ్‌లోకి వెళ్ళేవారు, వచ్చేవారికి ఈ గేట్ ద్వారానే మార్గం వుంటుంది. అక్టోబర్ 15 నుంచి ఈ విధానం యాక్టివ్ అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కార్‌పూలింగ్ విధానాన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ సిస్టమ్‌ని అందుబాటులోకి తెస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం నాలుగు గేట్స్ అబుదాబీలో అందుబాటులోకి వస్తున్నాయి. అల్ మక్తా బ్రిడ్జి, ముసాఫా బ్రిడ్జి, షేక్ జాయెద్ బ్రిడ్జి అలాగే షేక్ ఖలీఫా బ్రిడ్జిపై ఈ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. పీక్ అవర్స్‌లో 4 దిర్హామ్‌లు, నాన్ పీక్ అవర్స్‌లో 2 దిర్హామ్‌లుగా టోల్ ఫీజుని నిర్ణయించారు. శుక్రవారాలు అలాగే పబ్లిక్ హాలీడేస్‌లో 2 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. ఇ-పేమెంట్ మెషీన్ల ద్వారా వాహనదారులు టోల్ గేట్స్ ఫీజు చెల్లించవచ్చు. నెంబర్ ప్లేట్ ఆధారంగా ఫీజుని టోల్‌గేట్స్ వసూలు చేస్తాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







