అరబిక్‌ మాట్లాడే స్మార్ట్‌ టీవీ

- July 25, 2019 , by Maagulf
అరబిక్‌ మాట్లాడే స్మార్ట్‌ టీవీ

సియోల్‌: ప్రపంచంలోనే తొలిసారిగా అరబిక్‌లో మాట్లాడే స్మార్ట్‌ టీవీని సౌదీ అరేబియాలో ప్రారంభించనున్నట్లు సౌత్‌ కొరియాకి చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్రకటించింది. 2019 వెర్షన్‌ ఓఎల్‌ఈడీ అల్‌ తింక్‌ మరియు నానో సెల్‌ అల్‌ థింక్‌ మోడల్స్‌లో ఈ అరబిక్‌ లాంగ్వేజ్‌ లభ్యం కానుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ మోడల్‌ని డెవలప్‌ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ మోడల్‌ని డెవలప్‌ చేస్తున్నామనీ, త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెస్తామనీ, అరబిక్‌ లాంగ్వేజ్‌లో వచ్చే కమాండ్స్‌ ఆధారంగా ఈ టీవీ పనిచేస్తుందని సీనియర్‌ కమ్యూనికేషన్స్‌ మేనేజర్‌ - ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ - సియోల్‌, లీ జంగ్‌ మిన్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com