ఈ దుబాయ్ రెస్టారెంట్‌లో భోజనం ఉచితం
- July 30, 2019
దుబాయ్:ఓ అరబిక్ రెస్టారెంట్‌లో భోజనం ఉచితం.. అయితే, ఇది డబ్బులు చెల్లించలేనివారికి మాత్రమే.అయినాగానీ, లాభాపేక్షతో కూడిన ఫుడ్ బిజినెస్‌లో ఉచితంగా ఆహారం ఎలా అందిస్తారు.? నష్టాలు రావా? నష్టాలు వస్తాయని తెలిసీ ఎందుకు చేస్తున్నట్లు.? ఈ ప్రశ్నకు 'ఫౌల్ డబ్ల్యు హుమ్ముస్' రెస్టారెంట్ ఓనర్ అయిన జోర్డానియన్ వలసదారుడు ఫాది అయ్యాద్ సమాధానమిస్తూ, వ్యాపార ఆలోచనలతోనే రెస్టారెంట్ పెట్టిన మాట వాస్తవం అనీ, అయితే.. సామాజిక బాధ్యతని మర్చిపోకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉచిత భోజనాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు. రెస్టారెంట్‌లోని గ్లాస్ వాల్స్‌పై 'మీ దగ్గర డబ్బుల్లేవని చింతించొద్దు. మీకోసం ఉచితంగా ఆహారం సిద్ధంగా వుందిక్కడ..' అని రాశారు. దాంతో, డబ్బులున్నవారు కౌంటర్‌లో డబ్బులు చెల్లిస్తుంటారనీ, చెల్లించలేనివారు ఆకలి తీరిన ఆనందంతో చిరునవ్వులు రుసుముగా చెల్లిస్తుంటారని నిర్వాహకుడు ఫాది అయ్యాద్ చెప్పారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 మందికి ఉచితంగా ఆహారం అందిస్తుంది ఈ రెస్టారెంట్. అల్ బర్షా 1 వద్ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌కి సమీపంలో ఈ రెస్టారెంట్ వుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







