భారత్ కు అల్లుడు కాబోతున్న మరో పాకిస్తాన్ క్రికెటర్
- July 31, 2019
పాకిస్తాన్ క్రికెటర్, పేస్ బౌలర్ హసన్ అలీ ఇండియాకు అల్లుడు కాబోతున్నాడు. హరియాణాకు చెందిన షమీమా అర్జూను వివాహం చేసుకునేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 20వ తేదీన దుబాయ్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి నిఖా జరుగుతుందని క్రికెటర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
హరియాణా అమ్మాయి అయిన షమీమా భారత్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసి దుబాయ్‌లో స్థిరపడగా.. ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లింది. అనంతరం ఫ్లైట్ ఇంజనీర్‌గా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పెళ్లి విషయాన్ని హసన్ అలీ కూడా ఒప్పుకున్నారు. అయితే నిఖా డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని చెబుతున్నారు. దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటల్‌లో మాత్రం హసన్ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే భారత యువతిని పెళ్లి చేసుకుంటున్న నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ అవుతాడు.
ఇదివరకు జహీర్ అబ్బాస్, మోసిన్ ఖాన్, షోయబ్ మాలిక్‌లు భారత్‌కు చెందిన అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







