కెఫే కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం
- July 31, 2019
సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన కేఫ్ కాఫీడే అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక జాలరి ఒకరు ఇచ్చిన సమాచారంతో గాలించగా బుధవారం ఉదయం సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. సోమవారం సాయంత్రం మంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని తొక్కుట్టు ప్రాంతంలో నేత్రావతి నది వంతెన వద్ద ఆయన అదృశ్యమయ్యారు. వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని, ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను అధికారులు ఒత్తిడి భరించలేకపోతున్నాని ఓ లేఖ రాసిపెట్టి సిద్ధార్థ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత అదృశ్యమైన సిద్ధార్థ ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు నేత్రావతి నది పరిసరాల్లో దాదాపు 30 గంటల పాటు గాలించారు. ఎట్టకేలకు హోగే బజార్ ప్రాంతంలోని నేత్రావతి నదిలో ఆయన శవమై కనిపించినట్టు పోలీసులు తెలిపారు. అప్పటికే సిద్ధార్థ మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు వివరించారు. పోస్ట్‌మార్టం కోసం వెన్‌లాక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
జులై 29 సాయంత్రం బెంగళూరు నుంచి వచ్చిన సిద్ధార్థ, వ్యాపార పనులమీద కేరళకు వెళ్తున్నాని కుటుంబసభ్యులతో చెప్పి బయలుదేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నేత్రావతి నదిపై ఉన్న ఉల్లాల్ వంతెనవైపు వెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. అనంతరం అక్కడకు చేరుకున్న తర్వాత వంతెనపై కారు నిలపమని కోరిన సిద్ధార్థ, వాహనం దిగి నడుస్తూ కొద్దిసేపు ఫోన్‌లో మాట్లాడారు.
తర్వాత ఆయన కనిపించకపోవడంతో డ్రైవర్ ఆందోళన చెంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, డ్రైవర్ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచి మూడు పోలీసు బృందాలు ఓవైపు, ఎనిమిది పడవల సాయంతో గజ ఈతగాళ్లు, తీర ప్రాంత గస్తీదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మరోవైపు నేత్రావతి నదిని జల్లెడపట్టాయి. నదిలో ఎనిమిదో స్తంభం వద్ద ఓ వ్యక్తి నీటిలో దూకడం చూశానని స్థానిక జాలరి ఒకరు వెల్లడించినట్లు మాజీ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నందున రక్షించే సాహసం చేయలేకపోయినట్లు ఆ జాలరి తెలిపారు.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







