'వర్క్ ఫ్రం హోం' పేరుతో ఘరానా మోసం
- August 04, 2019
వర్క్ ఫర్ హోం పేరిట మోసం చేశారంటూ పలువురు బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి విష్ణుపురిలో వర్క్‌ఫ్రం హోం పేరిట ఓ కార్యాలయాన్ని ఇటీవలే తెరిచారు. పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి మంచి అవకాశం అంటూ నిరుద్యోగులకు ఉద్యోగం పేరిట ఆశ కల్పించారు. ఇందులో జాయిన్ అయ్యేవారు రూ. 2,500లు చెల్లించి చేరాలి. వారికి కొన్ని నిబంధనలు పెట్టి కొంత పని ఇచ్చారు. కాగా ఇందులో చైన్ లింక్‌గా ఇందులో చేరిన వ్యక్తి మరికొందరిని చేర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని చేర్పిస్తే రూ . 500 ఇస్తారు. ఇలా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి వేలకు వేలు వసూలు చేశారు. విశ్వచైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన వారితో సహా సుమారు 30 మంది వరకు ఈ వర్క్ ప్రం హోంలో చేరారు. ఇదంతా మోసం అని తెలుసుకున్న బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







