కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఇకలేరు...
- August 06, 2019
ఢిల్లీ:కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య శాలలో కన్నుమూశారు. గత కొంత కాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్స్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. దీంతో సర్వత్రా విషాదం అలుముకుంది. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి బిల్లు తొలగింపు సందర్భంగా ఆమె చివరి సారి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమితషాకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు. అయితే గత కొంత కాలంగా సుష్మా స్వరాజ్ అస్వస్థతతో బాధపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీకి సైతం దూరంగా ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..